పానీపూరీ అంటే.. పూరీలో పానీ ఉంటుంది. మరి.. పానీపూరీ ఐస్‌క్రీమ్ అంటే పూరీలో ఐస్‌క్రీమ్ ఉంటుందా? అనే డౌట్ మీకు వచ్చిందా? మీ డౌట్ నిజమే. పానీపూరీ ఐస్‌క్రీమ్ అంటే అంతే. ఈ వెరైటీ పానీపూరీ ఐస్‌క్రీమ్‌ను ఒక ఫుడ్ బ్లాగర్ ట్రై చేసింది.
మొదటిసారి పానీపూరీ ఐస్‌క్రీమ్‌ను తింటూ వీడియో తీసి తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది బెంగళూరుకు చెందిన ఫుడ్ బ్లాగర్ అంజలి ధింగ్రా.
బెంగళూరులోని డాక్ ఫ్రోస్టెడ్ అనే ఓ హోటల్లో ఈ పానీ పూరీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తారట. దాన్ని ఆర్డర్ చేసి.. ఇంటికి తెప్పించుకున్న అంజలి.. దాన్ని టేస్ట్ చేసింది. మరీ అంత బ్యాడ్‌గా అయితే ఏం లేదు. కాకపోతే.. కొంచెం చింతపులుపులా టేస్ట్ అనిపించింది అని చెప్పింది అంజలి. కాకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పింది. తను పానీపూరీ ఐస్‌క్రీమ్ తింటూ వీడియో తీసి ఆ వీడియోను తన ఇన్‌స్టా వీడియోలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొందరు నెటిజన్లు అయితే.. ఆ వీడియోపై పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో.. పానీపూరీ పేరును నాశనం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు.. ఒక్కసారైనా పానీపూరీ ఐస్‌క్రీమ్ టేస్ట్ చేయాలని కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న కోతికి సీపీఆర్.. క్యాబ్ డ్రైవర్‌పై ప్రశంసలు
బొద్దింకలతో బీరు తయారీ.. క్యూ కడుతున్న బీరు లవర్స్.. ఎక్కడో తెలుసా?