మామూలుగా బీరు దేనితో తయారు చేస్తారో తెలుసు కదా. బార్లీ గింజలతో చేస్తారు. ఎక్కడైనా బీరును వాటితోనే చేస్తారు. కానీ.. ఒక దేశంలో మాత్రం బీరును ఎలా తయారు చేస్తారో తెలుసా? బొద్దింకలతో. అది కూడా బొద్దింకలను ఉడకబెట్టి.. వాటి నుంచి రసం తీసి.. ఆ రసంతో తయారు చేసిన బీరు కోసం అక్కడ జనాలు ఎగబడతాడు. ఇంతకీ అది ఏ దేశం అంటారా? పదండి వివరంగా తెలుసుకుందాం.
జపాన్‌లోనే ఈస్పెషల్ బీరు దొరికేది. ఈ బీరును తైవాన్‌లో ఉండే మగ బొద్దింకలతో తయారు చేస్తారు. ఈ బొద్దింకలు.. నీళ్లలో కనిపిస్తుంటాయి. నీళ్లలో ఉండే ఇతర కీటకాలు, చేపలు వీటిని తిని జీవనం సాగిస్తుంటాయి.
ఈ బొద్దింకలను నీళ్లలో కొన్ని రోజుల పాటు ఉడికించి ఆ తర్వాత వాటి నుంచి వచ్చే రసంతో బీరును తయారు చేస్తారు. జపాన్‌లో బీరు తయారు చేసేందుకు ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ ఉంటుంది. దాని పేరే కబుటోకామా. ఆ పద్ధతి ప్రకారం వాటితో బీరు తయారు చేస్తారు. జపాన్‌లో తైవాన్ మగ బొద్దింకలను ఉన్న డిమాండే వేరు. వాటిని లొట్టలేసుకుంటూ తింటారు జనాలు. వీటితో బీరు మాత్రమే కాదు.. వీటితో పలు రకాల సూప్‌లు, వంటకాలు కూడా తయారు చేస్తారు. ఈ బొద్దింకలను అక్కడ మంచి క్వాలిటీ ఉన్న రొయ్యలుగా భావిస్తారు. అంతే కాదు.. వీటిని తరుచుగా తింటే ఆరోగ్యంగా ఉంటారని.. ఎక్కువ కాలం జీవిస్తారని జపనీయులు నమ్ముతారు. అందుకే.. ఆ బొద్దింకలకు అక్కడ అంత గిరాకీ.
సూప్‌లతో పాటు ఇప్పుడు ఆ బొద్దింకలతో బీరు కూడా తయారు చేస్తుండటంతో ఆ బీరుకు జపాన్‌లో ఫుల్ గిరాకీ వస్తోంది. దానికి కొంచు సోర్ బీర్ అనే పేరు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్కో బీరు బాటిల్‌కు మన కరెన్సీలో 300 రూపాయలు తీసుకుంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
7 వారాలు కరోనా వచ్చి కోమాలోకి వెళ్లింది.. ఆ తర్వాత కళ్లు తెరిచి చూసి షాక్ అయింది.. ఎందుకంటే?