యూకేకు చెందిన లారా వార్డ్ అనే మహిళకు కరోనా సోకింది. దాని తీవ్రత ఎక్కువ కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. తనకు కరోనా సోకినప్పుడే గర్భిణీ. అదే సమయంలో కోమాలోకి వెళ్లిపోవడంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు డాక్టర్లు. తను కొన్ని వారాల పాటు కోమాలోనే ఉండటంతో.. తన డెలివరీ డేట్ను ముందుకు జరపాల్సి వచ్చింది. తనకు డాక్టర్లు సిజేరియన్ చేసి కడుపులోని బిడ్డను బయటికి తీశారు. తనకు డెలివరీ అయినా కూడా కోమాలో నుంచి ఆ మహిళ బయటికి రాలేదు.
తనకు పుట్టిన పాప ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తనకు కరోనా సోకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ 7 వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది. మధ్యలో తనకు డెలివరీ అవ్వడం.. 7 వారాల తర్వాత తను కోమా నుంచి బయటికి వచ్చాక తనకు కూతురు పుట్టిందని తెలుసుకొని లారా షాక్ అయింది.
తను అప్పటికి వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో తనకు కరోనా తీవ్రత పెరిగింది. గర్బిణీలకు యూకేలో వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల తను కరోనా తీవ్రతను ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్వాసకు సంబంధించిన సమస్యలు రావడంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు. యూకేలోని రాయల్ బోల్డన్ ఆసుపత్రిలోనే తనకు కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన దగ్గరే డెలివరీ కూడా చేశారు. ఆ పాపకు హోప్ అనే పేరు పెట్టారు. కోమాలో నుంచి బయటపడ్డాక.. తన పాపను చూసి మురిసిపోయింది లారా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమ పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిన జంట.. వైరల్ వీడియో
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?