వదిలేసిన కారు పార్ట్స్‌తో హెలికాప్టర్ తయారుచేశాడు.. అది గాల్లోకి ఎగరడం చూసి నెటిజన్లు షాక్.. వైరల్ వీడియో
వదిలేసిన కారు పార్ట్స్‌తో హెలికాప్టర్ తయారుచేశాడు | ఉపయోగంలో లేని కార్లు, బైక్స్, ట్రక్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. కొన్ని ఏళ్ల పాటు వాహనాలను వాడకుండా ఉంటేనే అవి పనికిరాకుండా పోతాయి
ఉపయోగంలో లేని కార్లు, బైక్స్, ట్రక్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. కొన్ని ఏళ్ల పాటు వాహనాలను వాడకుండా ఉంటేనే అవి పనికిరాకుండా పోతాయి. కొన్ని వాహనాల లైఫ్ టైమ్ అయిపోతుంది. అటువంటి వాహనాల నుంచి పార్ట్స్ సేకరించి ఓ వ్యక్తి ఏకంగా హెలికాప్టర్‌నే తయారు చేశాడు.

బ్రెజిల్‌కు చెందిన జెనెసిస్ గోమెస్ అనే వ్యక్తికి ఏవియేషన్ మీద మంచి పట్టు ఉంది. చిన్నప్పటి నుంచి విమానాలు అన్నా.. హెలికాప్టర్లు అన్నా చాలా ఆసక్తి చూపించేవాడు. ఆ ఆసక్తితోనే చిన్నప్పటి నుంచి వాటి గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాడు. తాజాగా పనికిరాని వాహనాల పార్ట్స్‌ను ఉపయోగించి హెలికాప్టర్‌ను తయారు చేశాడు. దానికి వోల్క్స్వాగెన్ బీటిల్ ఇంజిన్‌ను అమర్చాడు. దాన్ని తయారు చేయడం పూర్తయ్యాక.. టెస్ట్ ట్రయల్ చేశాడు.
రోడ్డునే రన్‌వేగా మార్చుకొని.. దాని మీద ట్రయల్ ప్రారంభించాడు. అది కొంత దూరం వెళ్లాక గాల్లోకి ఎగిరింది. గాల్లో కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత గోమెస్ హెలికాప్టర్‌ను కిందికి దించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాప్టర్‌ను సొంతంగా తయారు చేసి గాల్లో ఎగిరేలా చేసిన అతడిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తమ పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిన జంట.. వైరల్ వీడియో
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

