చావు బతుకుల్లో ఉన్న కోతికి పునర్జన్మ ప్రసాదించాడు.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
చావు బతుకుల్లో ఉన్న కోతికి పునర్జన్మ ప్రసాదించాడు | ఈరోజుల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించాడు. ఓ ప్రాణాన్ని నిలిపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చావు బతుకుల్లో ఉన్న కోతికి
ఈరోజుల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించాడు. ఓ ప్రాణాన్ని నిలిపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చావు బతుకుల్లో ఉన్న కోతికి పునర్జన్మ ప్రసాదించాడు. ఈ ఘటన తమిళనాడులోని కున్నమ్ తాలుకా ఒతియం సామతువాపురంలో చోటు చేసుకుంది.

పెరంబలూర్‌కు చెందిన ప్రభు.. వృత్తి రిత్యా కారు డ్రైవర్. డిసెంబర్ 9న తన ఫ్రెండ్ బైక్ మీద ఊరెళ్తున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద ఓ కోతి స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించాడు. అప్పుడే దాన్ని కొన్ని కుక్కలు తరమడంతో అది స్పృహతప్పిపోయింది. ఆ కుక్కలు దాన్ని కరిచి గాయాలు కూడా చేశాయి.
వెంటనే బండి ఆపి.. ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమేసిన ప్రభు.. ఆ కోతిని తట్టి లేపాడు. కానీ.. కోతి లేవలేదు. దీంతో దానికి కొన్ని మంచినీళ్లు తాగించాడు. అయినా కోతి ఉలకలేదు.. పలకలేదు.
దీంతో వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఫ్రెండ్ బైక్ మీద దాన్ని తీసుకొని బయలు దేరాడు. మార్గమధ్యంలోకి రాగానే.. కోతికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు అది ఎక్కడ ప్రాణాలు కోల్పోతుందేమోనని వెంటనే బైక్ దిగి.. దానికి ప్రథమ చికిత్స చేశాడు. దాని చాతి మీద గట్టిగా నొక్కాడు. అయినా అది లేవలేదు. దీంతో తన నోట్లో నోరు పెట్టి.. ఆక్సిజన్ అందించడం ప్రారంభించాడు. అలా కొద్దిసేపు చేసిన తర్వాత దానికి శ్వాస అందింది. అప్పుడు ఆ కోతి కళ్లు తెరిచేసరికి.. ఆ వ్యక్తి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
వెంటనే దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు ప్రభు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే.. ఆ వీడియోను చూసి.. కోతికి పునర్జన్మ ప్రసాదించిన ఆ వ్యక్తికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నువ్వు గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోను చాలామంది ప్రముఖులు షేర్ చేశారు. క్రికెటర్ ఆర్ అశ్విన్, సినీ నటుడు సూర్య తదితరులు షేర్ చేసి.. ఆ వ్యక్తికి హ్యాట్సాఫ్ చెప్పారు.
There are people who still value every little life on this earth. Here Mr.Prabhu uses the first aid techniques he learned years back to resuscitate a 8 month old macaque which was attacked by a group of dogs
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) December 13, 2021
His swift action has saved the life of this little fella. @Thiruselvamts pic.twitter.com/bTHhIy5Km9
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తమ పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిన జంట.. వైరల్ వీడియో
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
Miss Universe Harnaaz Sandhu | మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్
21 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇద్దరు టీనేజర్ల కేసును ప్రాణాలకు తెగించి ఛేదించిన యూట్యూబర్..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

