ఇప్పుడు ప్రతి ఫోన్లో ఫేషియల్ రికగ్నిషన్ అనే ఫీచర్ ఉంటోంది. దాని వల్ల ఫోన్‌ను ఎవ్వరూ ఓపెన్ చేసే చాన్స్ ఉండదు. ఫేస్ చూపిస్తేనే ఫోన్ లాక్ అవుతుంది. కానీ.. ఆ ఫీచర్ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని ఈ ఘటన గురించి తెలుసుకుంటే అర్థం అవుతుంది.
ఓ యువకుడు.. తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఘోరంగా చీట్ చేశాడు. తను నిద్రపోతుండగా.. గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ తీసుకొని తన కనురెప్పలు తెరిచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఆ ఫోన్‌ను అన్‌లాక్ చేశాడు. ఆ తర్వాత తన ఫోన్లోని బ్యాంక్ యాప్ ద్వారా లక్షలు కొల్లగొట్టాడు.
ఈ ఘటన చైనాలోని చోటు చేసుకుంది. ఆ యువకుడు చేసిన నేరం రుజువు కావడంతో అతడికి మూడున్నర ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.
యువతి పడుకున్న విషయాన్ని గమనించిన యువకుడు ముందు ఫింగర్ ప్రింట్స్ ద్వారా తన ఫోన్‌ను అన్‌లాక్ చేశాడు. అయినా కూడా ఆ ఫోన్ అన్‌లాక్ కాలేదు. దీంతో ఫేస్ ఐడీ ద్వారా ఓపెన్ చేసేందుకు.. పడుకున్న తన గర్ల్‌ఫ్రెండ్.. కనురెప్పలను ఓపెన్ చేసి ఫేస్ ఐడీ ద్వారా ఆ ఫోన్‌ను అన్‌లాక్ చేసి.. తన అలిపే అకౌంట్(Alipay account)ను యాక్సెస్ చేసుకున్నాడు. ఆ అకౌంట్ పాస్వర్డ్ మార్చి పలు దఫాలుగా 150,000 యువాన్లను తన బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంటే మన కరెన్సీలో సుమారు 18 లక్షల రూపాయలు అన్నమాట.
ఆ యువకుడికి గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉండటం.. అప్పులు ఎక్కువవడంతో ఎలా అప్పులు తీర్చాలో తెలియక ఈ ప్లాన్ వేశాడు. మొత్తానికి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కానీ.. గర్ల్‌ఫ్రెండ్ ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
7 వారాలు కరోనా వచ్చి కోమాలోకి వెళ్లింది.. ఆ తర్వాత కళ్లు తెరిచి చూసి షాక్ అయింది.. ఎందుకంటే?
తమ పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిన జంట.. వైరల్ వీడియో
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి