చెన్నై : ఓ వానరంపై వీధి కుక్కలు దాడి చేయడంతో అది అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది ఆ కోతి. అటుగా వెళ్తున్న ఓ క్యాబ్ డ్రైవర్.. గాయాలతో ఉన్న కోతిని గమనించి.. సీపీఆర్(కార్డియో పల్మోనరీ రిససిటేషన్) ద్వారా ప్రాణం పోశాడు. కానీ ఆ వానరం 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు ఫారెస్ట్ ఏరియాలో వెలుగు చూసింది.
డిసెంబర్ 9వ తేదీన క్యాబ్ డ్రైవర్ ప్రభు తన మార్గంలో వెళ్తుండగా.. కోతిపై వీధి కుక్కలు దాడి చేయడాన్ని గమనించాడు. కోతికి తీవ్ర గాయాలు కావడంతో ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఆ కోతికి క్యాబ్ డ్రైవర్ సీపీఆర్ చేశాడు. కోతి నోట్లో క్యాబ్ డ్రైవర్ తన నోటితో గట్టిగా ఊపిరి వదిలాడు. అలా రెండు, మూడు సార్లు చేయడంతో కోతి స్పృహలోకి వచ్చింది. అనంతరం ఆ కోతిని పెరంబలూరు ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. కానీ అది ఒక రోజులోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్త తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ ప్రభు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ కోతి ప్రాణాలను సీపీఆర్ ద్వారా కాపాడిన క్యాబ్ డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
Netizens hail man seen in the video for saving the life of an unconscious monkey!#viral #viralvideo #monkey #animallover pic.twitter.com/ESM4bcR8Ew
— Zee News English (@ZeeNewsEnglish) December 14, 2021