Drink Chai And Eat Cup | చాయ్ తాగి అదే కప్పును తినేయొచ్చు.. హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయత్నం
చాయ్ తాగి అదే కప్పును తినేయొచ్చు | చాయ్ తాగాక.. ప్లాస్టిక్ లేదా పేపర్ కప్పులు అయితే వాటిని అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేస్తాం. మరి.. ఇతర కప్స్ అయితే వాటిని అక్కడ పెట్టి వెళ్లిపోతాం.

Drink Chai And Eat Cup | సాధారణంగా ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు చాయ్ ఆర్డర్ చేస్తే.. ఏ కప్పులో ఇస్తారు. కొందరు ప్లాస్టిక్ కప్పుల్లో ఇస్తారు. మరికొన్ని హోటళ్లలో పేపర్ కప్పుల్లో ఇస్తారు. ఇంకొందరు ఇతర కప్పుల్లో ఇస్తుంటారు. చాయ్ తాగాక.. ప్లాస్టిక్ లేదా పేపర్ కప్పులు అయితే వాటిని అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేస్తాం. మరి.. ఇతర కప్స్ అయితే వాటిని అక్కడ పెట్టి వెళ్లిపోతాం. మరి.. చాయ్ తాగాక.. అదే కప్పు కూడా తినదగినది అయితే ఎలా ఉంటుంది. అటువంటి ఆలోచనే వచ్చింది హైదరాబాద్‌కు చెందిన ఎడ్కో ఇండియా(Edco India) అనే కంపెనీకి.

ఈ కంపెనీ ప్రస్తుతం ఎడిబుల్ టీ కప్స్‌ను తయారు చేస్తోంది. అంటే చాయ్ తాగిన కప్పులను ఏంచక్కా లాగించేయవచ్చన్నమాట. టీ తాగి.. వాటిని కొరికి తినొచ్చు. చాయ్ ఎంత వేడిగా ఉన్నా కూడా ఆ కప్పులను ఏం కాదు. చల్లటి పానీయాలను కూడా అందులో తీసుకోవచ్చు.

మూడు రకాల కప్పులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. స్నాక్స్, డెజర్ట్స్, చాట్, కప్‌కేక్స్, లేయర్ కేక్స్, ఫ్రూట్ సలాడ్స్, సాస్, డిప్స్, కెచప్, తేనె లాంటి ఫుడ్ కోసం కూడా ఎడిబుల్ కప్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తోంది.

2017లో రోహన్ పమ్నానీ ఈ కంపెనీని స్థాపించాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడకుండా ఆపడం కోసమే వాఫర్, బిస్కట్స్ ఉపయోగించి.. ఈ కప్స్‌ను తయారు చేయడం ప్రారంభించాడు. రెండేళ్ల తర్వాత బిస్కట్ కప్స్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటిలో చాకొలేట్ కప్స్, చాకో బిస్కట్ కప్స్, వెనీలా, కార్డమామ్(యాలకులు) కప్స్‌ను కూడా లాంచ్ చేసింది. కాఫీ కోసం ఎస్ప్రెస్సో, హాట్ చాకొలేట్, మాచియాటో లాంటి కప్స్‌ను తయారు చేస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు హోటళ్లలో ఈ కంపెనీ తయారు చేసిన ఎడిబుల్ కప్స్‌ను వాడుతున్నారు. ఈ కప్స్‌ను ఆర్డర్ చేయాలనుకుంటే.. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి ఆర్డర్ చేయొచ్చు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
Apple Pakodas | ఎప్పుడైనా యాపిల్ పకోడీ టేస్ట్ చేశారా? వైరల్ వీడియో
Chocolate statue: చాక్లెట్‌తో భారీ విగ్రహం తయారీ.. ఎక్కడో తెలుసా..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

