Halwa Paratha | హల్వా తెలుసు కానీ.. ఈ హల్వా పరాటా ఏంది అంటారా? అవును.. ఇదోరకం వంటకం. సోషల్ మీడియాలో ఈ మధ్య సరికొత్త వంటకాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే కదా. పానీపూరీ ఐస్‌క్రీమ్, ఓరియో బజ్జీ, యాపిల్ పకోడి… ఇలా పలు రకాల వెరైటీ వంటలను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజాగా హల్వా పరాటా తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హల్వా పరాటాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న బాబా తాజ్ దర్గా హోటల్లో తయారు చేస్తున్నారు. ఉప్మా రవ్వ, శనగపిండితో ఈ హల్వా పరాటాను తయారు చేస్తారట. పరాటాను తయారు చేస్తుండగా ఓ ఫుడ్ బ్లాగర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆ పరాటాను చూసి… వామ్మో ఇంత పెద్ద పరాటానా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
Apple Pakodas | ఎప్పుడైనా యాపిల్ పకోడీ టేస్ట్ చేశారా? వైరల్ వీడియో
Chocolate statue: చాక్లెట్‌తో భారీ విగ్రహం తయారీ.. ఎక్కడో తెలుసా..?