Vicky Kaushal | పెళ్లి అయిన వారానికే షూటింగ్లో విక్కీ కౌశల్ బిజీ.. కత్రినా ఎక్కడ?.. ప్రశ్నిస్తున్న నెటిజన్లు
పెళ్లి అయిన వారానికే షూటింగ్లో విక్కీ కౌశల్ బిజీ | మరి కత్రినా ఎక్కడ? కత్రినా కైఫ్‌తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టు.. అంటూ నెటిజన్లు విక్కీని అడుగుతున్నారు.

Vicky Kaushal | గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మ్యారేజ్. అవును.. బాలీవుడ్‌కు చెందిన ఈ ప్రేమ జంట.. చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. వీళ్ల పెళ్లి రాజస్థాన్‌లో అంగరంగవైభవంగా జరిగింది. బాలీవుడ్‌కు చెందిన చాలామంది సినీ ప్రముఖులు విక్కీ, కత్రినా పెళ్లికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు.

డిసెంబర్ 9న వాళ్ల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వెంటనే కొత్త జంట ముంబైకి వచ్చేసింది. ఒక వారం గ్యాప్ ఇచ్చి వెంటనే కొత్త పెళ్లికొడుకు విక్కీ కౌశల్ షూటింగ్‌కు పయనమయ్యాడు. ఫ్రెష్‌గా సెల్ఫీ తీసి తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు విక్కీ. ముందు టీ.. ఆ తర్వాత షూటింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. విక్కీ కౌశల్ పెళ్లయిన వారానికే షూటింగ్లో బిజీ అయిపోతే.. మరి కత్రినా ఎక్కడ? కత్రినా కైఫ్‌తో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టు.. అంటూ నెటిజన్లు విక్కీని అడుగుతున్నారు.

పెళ్లయి వారం కూడా కాలేదు అప్పుడే షూటింగా? హనీమూన్ ప్లాన్ చేయలేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే.. శుక్రవారం నాడు కత్రినా కైఫ్.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సుజి కా హల్వాను మా అత్తయ్య, నా భర్త కోసం తయారు చేశాను.. అంటూ ఫోటోను షేర్ చేసింది. అలాగే.. హల్వాను కూడా చేసి నేనే చేశా.. అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇప్పటి వరకు నేను తిన్న హల్వాలో ఇదే బెస్ట్ అంటూ విక్కీ.. అప్పుడే కత్రినాను ఆకాశానికెత్తేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

