చిరకాల ప్రేమికుడు విక్కీకౌశల్ను పెళ్లాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినాకైఫ్. ఇటీవలే అత్తారింట్లో అడుగుపెట్టింది. భర్త విక్కీకౌశల్ కోసం పంజాబీ సంప్రదాయాలను పాటిస్తున్నది కత్రినాకైఫ్. శుక్రవారం ‘చౌన్కా చార్దానా’ వేడుకల్లో భాగంగా అత్తవారింట్లో మొదటిసారి వంట చేసింది కత్రినాకైఫ్. భర్త కోసం హల్వా చేసింది. తానే స్వయంగా ఈ స్వీట్‌ను సిద్ధంచేసినట్లు చెబుతూ ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేసింది. భార్య కత్రినాకు పాకశాస్త్రంలో ఉన్న ప్రావీణ్యాన్ని చూసి విక్కీ కౌశల్ మురిసిపోతున్నాడు. జీవితంలో తాను రుచిచూసిన అత్యంత మధురమైన స్వీట్ ఇదంటూ కత్రినాపై పొగడ్తలను కురిపించారాయన. భార్యాభర్తల మధ్య సాగిన ఈ సరదా సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.