అభిమానులే అతిథులుగా..

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అదే రోజు ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నారు. అభిమానులే అతిథులుగా ఈ వేడుకకు నిర్వహించబోతున్నామని, ట్రైలర్స్ కూడా వాళ్లే ఆవిష్కరిస్తారని చిత్రబృందం పేర్కొంది. పూజాహెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

