మంగళవారం 07 జూలై 2020
National - Jun 29, 2020 , 17:41:42

ఆ రాష్ర్ట సీఎంకు క‌రోనా నెగిటివ్

ఆ రాష్ర్ట సీఎంకు క‌రోనా నెగిటివ్

షిల్లాంగ్ : మేఘాల‌య ముఖ్య‌మంత్రి కే సంగ్మాకు క‌రోనా నెగిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు వెల్ల‌డించారు. సీఎం సంగ్మా ర‌క్త న‌మూనాల‌ను జూన్ 22న సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, నెగిటివ్ వ‌చ్చింది. మ‌ళ్లీ ఆదివారం కూడా ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివే వ‌చ్చిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. 

సీఎంకు క‌రోనా నెగిటివ్ రావ‌డంతో.. ఆయ‌న స‌హ‌చ‌రులు, అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు. మేఘాల‌య‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 50 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఒక‌రు మాత్ర‌మే క‌రోనాతో చ‌నిపోయారు.

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామితో పాటు ఆయ‌న సిబ్బందికి కూడా క‌రోనా నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు అక్క‌డి వైద్యాధికారులు వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. అయితే సీఎం కార్యాల‌యం వ‌ద్ద ఉండే ఓ గ‌న్ మెన్ తండ్రికి క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో 32 మంది భ‌ద్ర‌తా సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాలు రావాల్సి ఉంది.


logo