Army camp | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి (Chamoli) జిల్లాలోని జోషిమఠ్ (Joshimath)లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) సంభవించింది. ఔలి రోడ్డులో గల ఆర్మీ క్యాంప్ (Army camp)లో మంటలు చెలరేగాయి. క్యాంప్ లోపల ఓ దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో ఆర్మీ క్యాంప్‌లో దాదాపు 100 మంది జవాన్లు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు స్పాట్లో ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | A massive fire broke out in a store located inside an Army camp on the Auli Road in Joshimath, Chamoli district of Uttarakhand. Fire tenders present at the spot. https://t.co/RTNBve31ED pic.twitter.com/ppcMVLA0Fs
— ANI (@ANI) January 2, 2026
Also Read..
Landslides | రద్దీ రహదారిపై భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ దృష్యాలు
Water Contamination | కలుషిత నీటి ఘటన.. 10 మంది మృతి : ఇండోర్ మేయర్
Zomato CEO | పది నిమిషాల్లో డెలివరీ వెనకున్న రహస్యం ఇదీ : జొమాటో సీఈవో