Water Contamination | దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేర్కొనే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (Indore)లో కలుషిత తాగునీటి (water contamination) వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భగీరథ్పుర (Bhagirathpura)లో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించినట్లు ఇండోర్ మేయర్ (Indore Mayor) పుష్యమిత్ర భార్గవ (Pushyamitra Bhargava) శుక్రవారం తెలిపారు. కలుషిత నీరు తాగి డయేరియాతో ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు.
భగీరథ్పుర నుంచి సేకరించిన తాగునీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ల్యాబ్ నివేదిక నిర్ధరించినట్లు వెల్లడించారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలోని తాగునీరు కలుషితమైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో సుమారు 100 మందికిపైగా స్థానికులు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read..
Parrots Die Of Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ వల్ల.. 200 చిలుకలు మృతి
Zomato CEO | పది నిమిషాల్లో డెలివరీ వెనకున్న రహస్యం ఇదీ : జొమాటో సీఈవో
Degree College: 19 ఏళ్ల విద్యార్థిని మృతి.. కాలేజీ ప్రొఫెసర్, స్టూడెంట్స్పై కేసు నమోదు