సోమవారం 06 జూలై 2020
National - Jun 15, 2020 , 19:05:38

ఊపందుకున్న నైరుతి రుతుప‌వ‌నాలు

ఊపందుకున్న నైరుతి రుతుప‌వ‌నాలు

న్యూఢిల్లీ: ‌జూన్ 1న కేర‌ళ తీరాన్ని తాకిన నైరుతి రుతుప‌వనాలు ఆ త‌ర్వాత మెల్ల‌గా క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోకి ప్ర‌వేశించి ఇప్పుడు తూర్పు, ఈశాన్యం దిశ‌గా క‌దులుతున్నాయి. ఇన్నాళ్లు నిదానంగా క‌దిలిన  నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఊపందుకున్నాయ‌ని భార‌త వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ రుతుప‌వ‌నాల ప్ర‌భావంవ‌ల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, డయ్యూ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. 

అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని ప‌లు ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ వెల్ల‌డించింది. మ‌రోవైపు రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకు అల్పపీడనం ఏర్పడనుందని, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలపై ఈ అల్ప‌పీడ‌నం ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనంవల్ల గోవాలోని కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశా, సిక్కింలలో భారీ వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.


logo