Apps:
Follow us on:

Health Tips | పండ్లు తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు?

1/7పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజులో కనీసం ఏదైనా ఒక్క పండు తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు. అయితే ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మనలో చాలామందికి అలవాటే ఉంటుంది. అలాగే పండ్లు తిన్నప్పుడు కూడా నీళ్లు తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. కొన్ని రకాల పండ్లు తిన్న వెంటనే నీళ్లు తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి.
2/7రోజుకో యాపిల్‌ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని పెద్దలు చెబుతుంటారు. దీనికి కారణం అందులో ఉండే పోషకాలే. యాపిల్‌ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ అదే మీరు యాపిల్‌ తిన్న వెంటనే నీరు తాగితే.. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
3/7అరటి పండ్లు అంటే ఇష్టపడని వారుండరు. అలాగే చాలామంది తినే పండు కూడా ఇదే అని చెప్పొచ్చు. కానీ అరటి పండు తిన్న వెంటనే నీరు తాగితే రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ ప్రభావితం అవుతాయి. తద్వారా ఇన్సులిన్‌ పరిమాణం పెరుగుతుంది.
4/7దానిమ్మ పండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. కానీ దానిమ్మ గింజలు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల వికారం, అసిడిటీ, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
5/7నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్‌ పండ్లు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. సిట్రస్‌ ఫ్రూట్స్‌ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. శరీరంలోని pH లెవల్స్‌ గణనీయంగా తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి.
6/7సమ్మర్‌లో దొరికే పుచ్చకాయ తినడం కూడా మంచిది కాదు. ఎలాగూ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మళ్లీ నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌ అయ్యి.. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
7/7సమ్మర్‌లో దొరికే పుచ్చకాయ తినడం కూడా మంచిది కాదు. ఎలాగూ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మళ్లీ నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌ అయ్యి.. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.