శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 21:53:54

మణిపూర్‌లో 57 కరోనా పాజిటివ్‌ కేసులు

మణిపూర్‌లో 57 కరోనా పాజిటివ్‌ కేసులు

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 57 పాజిటివ్‌ కేసులు నమొదైటనట్లు ఆ రాష్ట్ర సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 898కి చేరుకున్నాయి. ఇందులో 648 యాక్టివ్‌ కేసులున్నాయి. 

‘గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 41 మంది పురుషులు, 16 మంది మహిళలున్నారు. 52 మంది ఇతర రాష్ట్రాలనుంచే వచ్చారు. వీరందరినీ కొవిడ్‌ కేర్‌ ఫెసిలిటీ సెంటర్లకు తరలించాం.’ అని రాష్ట్ర సర్కారు పేర్కొంది. కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో అన్ని రకాల వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. logo