ఇంఫాల్: దేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఈ ఉదయానికి దేశవ్యాప్తంగా ఇచ్చిన కరోనా డోసుల సంఖ్య 10 కోట్ల మార్కు దాటింది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్రం ఇవాళ్టి నుంచి టీకా ఉత్సవ్ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 11, 12, 13, 14 తేదీల్లో వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేయనున్నారు.
మణిపూర్ టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన వైద్య సిబ్బంది ఆయన టీకా వేశారు.
Manipur CM N Biren Singh receives his first dose of #COVID19 vaccine today at the launch of 'tika (vaccination) utsav' in Imphal's Jawaharlal Nehru Institute of Medical Sciences pic.twitter.com/1sRZvp1xv7
— ANI (@ANI) April 11, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
అది ఒక హత్యాకాండ.. కూచ్‌బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం..!
దేశంలో 10 కోట్ల మార్కు దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్: కేంద్రం