Wife Dies | జైపూర్ : ఇది హృదయ విదారక ఘటన. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన భార్య బాగోగులు చూసుకునేందుకు ఓ భర్త తన ప్రభుత్వానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. ఇక ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఆయన పదవీ విరమణ ఫంక్షన్లోనే భార్య తుదిశ్వాస విడిచింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. దేవేంద్ర భార్య దీపిక గృహిణి. అయితే దీపిక గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ దంపతులకు సంతానం కూడా లేదు. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలని నిర్ణయించుకున్న దేవేంద్ర.. మూడేండ్లు ముందుగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇక ఆఫీసు సిబ్బంది.. దేవేంద్రకు పదవీ విరమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు దీపిక కూడా హాజరయ్యారు.
ఇక దేవేంద్రతో పాటు దీపికను కూడా కుర్చీలో కూర్చోబెట్టారు. పూలమాలలు, శాలువాలతో సత్కరిస్తూ ఉద్యోగులందరూ ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే దీపిక ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దేవేంద్రతో పాటు సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి..
Crime news | పార్లమెంట్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. Video
Crime news | పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!
Jagtial | ఆస్తి కోసం తల్లిలా ఆదరించారు.. కానీ మృతదేహాన్ని తాకేందుకు నిరాకరించారు..