Crime news | పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!
Crime news | ఆమె నిత్య పెళ్లి కూతురు..! ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది..! బుట్టలో పడిన వారిని పెళ్లి చేసుకుంటుంది..! వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెడుతుంది..! కలిసి కాపురం చేస్తుంది..! అవకాశం చిక్కగానే ఇంట్లోని నగదు, నగలు తీసుకుని ఉడాయిస్తుంది..!
Crime news : ఆమె నిత్య పెళ్లి కూతురు..! ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది..! బుట్టలో పడిన వారిని పెళ్లి చేసుకుంటుంది..! వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెడుతుంది..! కలిసి కాపురం చేస్తుంది..! అవకాశం చిక్కగానే ఇంట్లోని నగదు, నగలు తీసుకుని ఉడాయిస్తుంది..! ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా ఆరుగురిని మోసం చేసింది..! తాజాగా ఏడో వ్యక్తిని మోసం చేసే ప్రయత్నంలో తన టీమ్‌తో సహా పోలీసులకు చిక్కింది..!
వివరాల్లోకి వెళ్తే.. పూనమ్, సంజనా గుప్తా, విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి నలుగురూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పూనమ్ పెళ్లి కూతరులా, సంజనా ఆమెకు తల్లిలా వ్యవహరిస్తుంది. విమలేశ్, ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా.. అని టార్గెట్స్ కోసం వెతుకుతారు. టార్గెట్ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని, అందుకు రూ.1.5 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు.
అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనమ్, సంజనాల దగ్గరికి తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనమ్ పెళ్లి కొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ అవకాశం చిక్కేదాక అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగదు, నగలు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపధ్యాయ్ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్ చేసింది.
విమలేష్, ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనమ్, సంజనాలతో మాట్లాడించారు. అయితే శంకర్ ఉపాధ్యాయ్‌కి వారు తీరుపై అనుమానం కలిగింది. దాంతో రూ.1.5 లక్షలకు ముట్టజెప్పేందుకు నిరాకరించాడు. దాంతో పూనమ్ ముఠా అతడిని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. బాందా పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

