Bomb Threat | ఇటీవలే దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఎక్కువైపోయాయి. పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు సహా పలువురు రాజకీయ నాయకులకు వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ (Al-Qaeda) పేరుతో పాట్నాలోని సీఎం కార్యాలయాన్ని (Bihar Chief Ministers Office) పేల్చేస్తామంటూ శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఎటువంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీనిపై కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు మెయిల్ ఆధారంగా ఓ వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు (Man Arrested). అనుమానితుడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన 51 ఏళ్ల మొహమ్మద్ జాహిద్‌గా గుర్తించారు. అతడికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read..
INDIA Alliance | ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ తగ్గించండి.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన
Sheikh Hasina | మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా.. ఎందుకంటే..?