INDIA Alliance | ఆరోగ్య, జీవిత బీమా పాలసీల (Health Insurance)పై ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని విపక్ష ఇండియా కూటమి పార్టీల సభ్యులు (INDIA alliance leaders) డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నిరసన తెలిపారు. పార్లమెంట్ భవనం మకర ద్వారం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18 శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#WATCH | Delhi: INDIA alliance leaders hold protest demanding rollback of GST on health insurance and life insurance, outside Makar Dwar in Parliament pic.twitter.com/cH3m5OKSdS
— ANI (@ANI) August 6, 2024
కాగా, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ సోమవారం ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన విషయం తెలిసిందే. అధిక పన్ను ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లడారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే రకమైన డిమాండ్ చేసినట్లు ఆయన ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇండియాలో ఇన్సూరెన్స్ కేవలం 4 శాతమే ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగా అది ఏడు శాతంగా ఉందని, బీమా రంగంలో అసమానతలు ఉన్నాయని, 75 శాతం జీవిత బీమా పాలసీలు ఉన్నాయని, మరో 25 శాతం వైద్య బీమాలు ఉన్నట్లు ఒబ్రెయిన్ తెలిపారు.
హెల్త్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని తగ్గించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆర్థిక మంత్రి కనీసం రోడ్డు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ వ్యాఖ్యలను అయినా ఆలకించాలని టీఎంసీ ఎంపీ తెలిపారు.జీఎస్టీ మండలి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఎంపీ ఒబ్రెయిన్ తిరస్కరించారు. ఆ వాదనలో వాస్తవం లేదన్నారు. మండలిలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నదని, కావాలంటే దీన్ని మార్చవచ్చు అని తెలిపారు.
జీవిత, వైద్య బీమా పథకాలపై జీఎస్టీ వద్దు.. నిర్మలా సీతారామన్‌కు నితిన్ గడ్కరీ లేఖ
లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై (life and medical insurance plans) చెల్లించే జీఎస్టీ (GST)ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు ఇటీవలే లేఖ రాశారు. నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన మెమోరాండం ప్రకారం లేఖ రాస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.
‘యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ఉపసంహరణకు సంబంధించినది. ఈ రెండింటిపై 18 శాతం పన్ను ఉంది. జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీ విధించడం అనేది అనిశ్చితిపై పన్ను విధించడం కిందకే వస్తుంది. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి తీసుకునే జీవిత బీమాపై పన్ను విధించకూడదని యూనియన్ భావిస్తోంది. అదేవిధంగా, వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అనేది సమంజసం కాదు. సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వీటిపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని యూనియన్ కోరుతోంది’ అని నితిన్ గడ్కరీ తన లేఖలో వివరించారు.
Also Read..
Sheikh Hasina | మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా.. ఎందుకంటే..?
ISKCON Temple | బంగ్లాదేశ్‌లో ఆందోళనల మాటున హిందూ ఆలయాలపై దాడులు.. ఇస్కాన్ టెంపుల్ ధ్వంసం
All Party Meeting | బంగ్లాదేశ్ సంక్షోభం.. ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం