IndiGo | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అక్టోబర్ 9న ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో (Delhi – Chennai Flight) ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ జైపూర్, ఢిల్లీ పర్యటనను ముగించుకొని చెన్నై తిరిగి వెళ్తోంది. ఆమె వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి మహిళను అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని 45 ఏళ్ల రాజేశ్ శర్మగా గుర్తించారు. అతడు వృత్తిరీత్యా మార్బుల్ టైల్ లేయర్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
Also Read..
Shilpa Shetty | మనీలాండరింగ్ కేసు.. శిల్పాశెట్టి దంపతులకు ఊరట
PM Modi: బంగ్లాదేశ్‌లో మోదీ గిఫ్ట్ ఇచ్చిన కిరీటాన్ని దొంగలించారు..
Srinu Vaitla | రవితేజ సూపర్‌హిట్ వెంకీకి తర్వలో పార్ట్-2.. శ్రీనువైట్ల ఈసారి ఆ హీరోతోనే తీస్తారట