Srinu Vaitla | ఢీ, రెడీ, దూకుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీనువైట్ల (Srinu Vaitla) గత కొంతకాలం నుంచి రేసులో వెనుకబడ్డాడు. ఫార్ములా కథలకు కాలం చెల్లడంతో శ్రీనువైట్ల కమ్‌బ్యాక్ కాలేకపోతున్నాడు. అయితే వినోదాన్ని పండించడంలో ఈ దర్శకుడికి ఓ పత్యేక శైలి. ఇప్పటికి ఢీ, రెడీ, దూకుడు, నమో వెంకటేశ లాంటి చిత్రాల్లో కామెడి ఏపిసోడ్స్ యూట్యూబ్‌ల్లో ట్రెండింగ్‌లో వుంటాయి. ఇక చాలా కాలం తరువాత శ్రీనువైట్ల గోపీచంద్‌తో ‘విశ్వం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ రోజు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాని తుదిఫలితం కూడా కొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే చిత్రంలో యాక్షన్‌తో పాటు తన శైలి వినోదం కొత్తగా వుంటుందని, కామెడీని పండించడంలో తనది అప్డేటెడ్ వెర్షన్ ఇందులో చూపిస్తానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు దర్శకుడు.
అయితే ఈ చిత్రం తరువాత ఆయన రవితేజతో తీసిన వెంకీ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తానని అంటున్నాడు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘వెంకీ లాంటి వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో వున్నాను. సెకండాఫ్‌లో క్రైమ్ కామెడీతో పాటు చిన్న సస్పెన్స్ వుంటుంది. కానీ వినోదాన్ని మాత్రం డబుల్డోస్లో జోడిస్తా. ఫస్టాఫ్‌లో మించిన కామెడీ సెకండాఫ్‌లో వుంటుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని ఎంజాయ్ చేసే విధంగా సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నాను. వెంకీ కథ నుంచి ప్రేరణ పొంది ఈ కథను రాసుకున్నాను. వెంకీ కంటే పది రెట్లు మించిన కథ ఇది’ అన్నారు. అయితే ఈ సినిమా వెంకీకి సీక్వెల్‌గానే వుంటుంది కానీ, దీనికి ఆ కథకు సంబంధం వుండదని సమాచారం. వెంకీ సీక్వెల్ ప్లాన్‌ను రవితేజకు చెప్పగానే అంగీకరించారని, సినిమాను తన స్నేహితులతో కలిసి శ్రీనువైట్ల నిర్మిస్తాడని తెలుస్తున్నది.