PM Modi: బంగ్లాదేశ్‌లో మోదీ గిఫ్ట్ ఇచ్చిన కిరీటాన్ని దొంగలించారు..
PM Modi : బంగ్లాదేశ్‌లోని శక్తిపీఠం జెషోరేశ్వరి కాళీమాతకు ప్రధాని మోదీ సమర్పించిన కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు పూతతో కూడిన వెండి కిరీటాన్ని ఆయన బంగ్లా పర్యటనలో సమయంలో గిఫ్ట్‌గా ఇచ్చారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ(PM Modi) కాళీమాతకు కిరీటాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. సత్కిరాలోని జెషోరేశ్వరీ ఆలయంలో ఉన్న కాళికాదేవికి ప్రధాని మోదీ కిరీటాన్ని బహూకరించారు. బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని ఆయన సమర్పించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 నిమిషాల మధ్య గుడిలో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. పూజారి దిలీప్ ముఖర్జీ ఆలయ వదిలి వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగింది.
కాళికాదేవి తలపై ఉండాల్సిన కిరీటం కనిపించడం లేదని ఆ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు గుడిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తైజుల్ ఇస్లామ్ తెలిపారు. 51 శక్తి పీఠాల్లో జెషోరేశ్వరీ దేవి ఆలయం కూడా ఒకటి. 2021 మార్చిలో బంగ్లాదేశ్ వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ ఆ కిరీటాన్ని బహూకరించారు. మోదీనే స్వయంగా ఆ కిరీటాన్ని అమ్మవారి తలపై అలంకరించారు.
సత్కిరాలోని ఈశ్వరిపుర్లో ఆలయం ఉన్నది. అనారీ అనే బ్రాహ్మణుడు 12వ శతాబ్ధంలో ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 13వ శతాబ్ధంలో లక్ష్మణ్ సేన్ ఆలయాన్ని పునర్ నిర్మించారు. మళ్లీ 16వ శతాబ్ధంలో రాజా ప్రతాపాధిత్య ఆ ఆలయాన్ని రీ డెవలప్ చేశారు. ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు మోదీ తన పర్యటన సమయంలో పేర్కొన్నారు.
We have seen reports of theft of the crown gifted by PM Modi to Jeshoreshwari Kali Temple (Satkhira) in 2021 during his visit to 🇧🇩
We express deep concern & urge Govt of Bangladesh to investigate theft, recover the crown & take action against the perpetrators@MEAIndia @BDMOFA
— India in Bangladesh (@ihcdhaka) October 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

