Mamata Banerjee | పెండింగ్ నిధులు వారంలోగా చెల్లించాలి.. మోదీ సర్కార్‌కు మమతా బెనర్జీ అల్టిమేటం
Mamata Banerjee | కేంద్రంలోని మోదీ సర్కార్‌కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అల్టిమేటం (Ultimatum) జారీచేశారు.
Mamata Banerjee | కేంద్రంలోని మోదీ సర్కార్‌కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అల్టిమేటం (Ultimatum) జారీచేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు (Pending Funds) ఇవ్వకపోతే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
శుక్రవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న దీదీ ఈ సందర్భంగా మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన చాలా వరకు నిధులను పెండింగ్‌లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించకపోతే ఊహించని రీతిలో నిరసనలు చేపడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
బెంగాల్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 9,330 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ.6,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోపాటు నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి రూ.830 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.770 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.350 కోట్లు, మధ్యాహ్న భోజనం కోసం రూ.175 కోట్ల మేర కేంద్రం నుంచి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని పథకాలకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. ఈ పెండింగ్ నిధులను ఏడు రోజుల్లోగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి దీదీ అల్టిమేటం జారీ చేశారు.
Also Read..
Nitish Kumar | ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?
Arvind Kejriwal | ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
Houthis | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

