Nitish Kumar | ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?
Nitish Kumar | లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ (Bihar)లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) పదవికి శనివారం నాడు నితీశ్ రాజీనామా చేయబోతున్నారంటూ సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
Nitish Kumar | లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ (Bihar)లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెందపులు చేసుకునేందుకు జేడీయూ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధమైనట్లు గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది.
ఎన్డీయే కూటమితో చేతులు కలిపేందుకు నితీశ్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. నితీశ్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి (Chief Minister) పదవికి శనివారం నాడు నితీశ్ రాజీనామా చేయబోతున్నారంటూ సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనతోపాటు వెళ్తారని తెలిపాయి. ఇక నితీశ్ ఆదివారం రోజున 9వసారి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ ప్రమాణం చేసే అవకాశాలున్నాయని వెల్లడించాయి.
Also Read..
Arvind Kejriwal | ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
Houthis | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- BJP-led NDA
- JDU
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

