e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News మోదీజీ.. క‌రోనా మందుల‌పై అయినా ప‌న్ను మాఫీ చేయండి!

మోదీజీ.. క‌రోనా మందుల‌పై అయినా ప‌న్ను మాఫీ చేయండి!

మోదీజీ.. క‌రోనా మందుల‌పై అయినా ప‌న్ను మాఫీ చేయండి!

కోల్‌క‌తా : కొవిడ్‌-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందుల‌పై పన్నులు మాఫీ చేయాల్సిందిగా కోరుతూ ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఆదివారం లేఖ రాశారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్స కోసం పరికరాలు, మందులు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు.

ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్స్‌, సిలిండ‌ర్లు, కంటైనర్లు, కొవిడ్ సంబంధిత డ్ర‌గ్స్‌ను ప్ర‌భుత్వానికి అందించేందుకు వ్య‌క్తిగ‌తంగానూ, సంస్థ‌లు కూడా ముందుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు. కావునా వీటిని ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ ప‌రిధిలోంచి తొల‌గించాల్సిందిగా ఆమె కోరారు.

పైన తెలిపిన‌వ‌న్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్న నేప‌థ్యంలో రోగుల ప్రాణాల‌ను కాపాడే మందులు, ప‌రికరాల స‌ర‌ఫ‌రాకు అడ్డంకులు తొల‌గించాల్సిందిగా అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు. కొవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌కు ఈ చ‌ర్య దొహ‌దం చేస్తుంద‌న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మోదీజీ.. క‌రోనా మందుల‌పై అయినా ప‌న్ను మాఫీ చేయండి!

ట్రెండింగ్‌

Advertisement