Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, పేదల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని యువత ఉద్యోగాలను కోరుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్ధానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో మొత్తం 28 సీట్లకు గాను తమ పార్టీ 15 నుంచి 20 స్ధానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ వనరులను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు దారాధత్తం చేస్తుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు.
మహిళలకు ఏటా రూ. లక్ష అందించడం ముస్లిం లీగ్ కార్యక్రమమా అని ప్రధానిని ఆయన నిలదీశారు. యువతకు ఉపాధి కల్పించడం, శిక్షణ కోసం వారికి రూ. లక్ష అందించడం ముస్లిం లీగ్ ప్రణాళికా అని ప్రశ్నించారు. తాము దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరి కోసం 25 గ్యారంటీలు ప్రకటించామని, పేదలు, మహిళలు, యువత, దళితులు సహా అందరి సంక్షేమం కోసం హామీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రజలు ఎన్నటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, లేనిపక్షంలో దేశంలో సరైన పాలన కొరవడుతుందని జవహర్లాల్ నెహ్రూ చెప్పేవారని వివరించారు.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏం చేసేందుకైనా కాషాయ నేతలు వెనుకాడటం లేదని, అదే దేశానికి ఉపయోగపడే పనులు మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. హుబ్బలిలో యువతి నేహ హిరేమథ్ హత్య కేసు ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పలువురు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని, తాను ఈ ఘటనను ఖండిస్తున్నానని చెప్పారు. చట్టం ఈ విషయంలో తన పని తాను చేసుకుపోతుందని, ఏ ఒక్కరినీ తాము సమర్ధించడం లేదని ఖర్గే పేర్కొన్నారు.
Read More :
Jagadish Reddy | రేవంత్ రెడ్డి కాదు.. ఆయన రోతంత రెడ్డి.. నిప్పులు చెరిగిన జగదీశ్ రెడ్డి