Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీట్ (NEET test) మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు 17 ఏళ్ల బాలికను తండ్రి చితకబాదాడు. దెబ్బలు తట్టుకోలేక ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది (girl beaten to death by father).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాంగ్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల సాధన (Sadhana) 12వ తరగతి చదువుతోంది. ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రిపరేటరీ పరీక్ష రాసింది. అందులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన తండ్రి దోండిరామ్ భగవాన్ భోస్లే.. సాధనపై శుక్రవారం రాత్రి చెక్క కర్రతో దాడి చేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు బాలికకు తవ్ర గాయాలయ్యాయి.
మరుసటి రోజు తల్లి ప్రీతి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో.. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. అంత్యక్రియలు పూర్తైన అనంతరం తన భర్తపై ప్రీతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురు 10వ తరగతి పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చిన కారణంగా కుమార్తెను కొట్టినట్లు తెలిపింది. ప్రీతి ఫిర్యాదు మేరకు భగవాన్ భోస్లేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కస్టడీకి తరలించారు. అతను ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ప్రిన్సిపల్‌గా గుర్తించారు.
Also Read..
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
BJP MLA | వందేభారత్ రైల్లో ప్రయాణికుడిపై దాడి.. ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీసులు
Operation Sindhu | 268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న మూడో విమానం