ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతిరోజు అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు. గత నెల 1 నుంచి 30 వరకు మొత్తం 17,46,309 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఏప్రిల్ 1న 28,56,163గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య నెలాఖరు నాటికి 46,02,472 చేరింది. కాగా, గతేడాది సెప్టెంబర్ 16న మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 10,97,856 ఉన్నది. అది ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 28,56,163కు పెరిగింది. అంటే కేవలం 196 రోజుల్లోనే 17 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా రెండోసారి విజృంభించడంతో కేవలం 30 రోజుల్లోనే 17.46 కేసులు రికార్డవడం విశేషం. అదేవిధంగా గత 167 రోజుల్లో కరోనాతో 14,039 మంది మృతిచెందారు. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కూడా రెట్టింపు చేసింది. ఏప్రిల్ నెలలో మొత్తం 1,99,75,341 నమూనాలను పరీక్షించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..