Assam Earthquake | గత కొన్ని రోజులుగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అసోం (Assam) రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాంరూప్ (Kamrup) జిల్లాలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలు ( Richter scale)పై భూకంపం ( Earthquake) తీవ్రత 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology-NCS) తెలిపింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో అసోంలోని నాగోస్ ప్రాంతంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. ఇక అదే నెలలో గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వరుసగా భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake of Magnitude:3.2, Occurred on 08-03-2023, 03:59:08 IST, Lat: 26.23 & Long: 91.44, Depth: 10 Km ,Location: Kamrup, Assam, India for more information Download the BhooKamp App https://t.co/9tKTdbnFqg@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS pic.twitter.com/cp5CWMic4N
— National Center for Seismology (@NCS_Earthquake) March 7, 2023
Also Read..
Russia – Ukraine War | యుద్ధం మిగిల్చిన విషాదం.. కనుమరుగైన మరింకా పట్టణం..!
Khushbu | ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు : ఖుష్బూ
Iran | బాలికలపై విషప్రయోగం.. విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురి అరెస్ట్