Iran | ఇరాన్ (Iran)లో బాలికలను పాఠశాల విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతో వారిపై విషప్రయోగం
(poisoning) చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరు చివరి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటనపై ఇరాన్ (Iran) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసు విచారణ చేపట్టిన నిఘా సంస్థలు పలువురిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
ఏఎఫ్‌బీ (AFP) నివేదిక ప్రకారం.. దేశంలోని ఆరు ప్రావిన్సు (six provinces)ల్లో ప్రమాదకర పదార్థాలను తయారు చేస్తున్నారన్న అనుమానంతో కొందరిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అరెస్టు చేసిన వారిలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ (deputy interior minister) మజీద్ మిరాహ్మదీ (Majid Mirahmad) అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఖుజెస్థాన్ (Khuzestan), వెస్ట్ అజెర్బాయిజన్ ( West Azerbaijan), ఫార్స్ (Fars), ఖేర్మన్షా (Kermanshah), ఖోరసన్ (Khorasan ), ఆల్బోర్జ్ (Alborz) ప్రావిన్సుల్లో (provinces)ని పలువురు అనుమానితుల్ని అరెస్టు చేశాం. అందులో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై నిఘా సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం’ అని తెలిపారు.
బాలికలను విద్యకు దూరం చేయాలన్న లక్ష్యంతో ఇరాన్ (Iran)లో ఇటీవల వందలాదిమంది బాలికలపై మత ఛాందసవాదులు విష ప్రయోగం చేశారు. ఫలితంగా వారంతా ఆసుపత్రుల పాలయ్యారు. మూడు నెలలుగా దాదాపు 1000 మందికి పైగా బాలికలపై విష ప్రయోగం జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. బాలికలు అస్వస్థతకు గురికావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి. దీంతో ఆ దేశ సుప్రీం లీడర్ (Iran Supreme leader) అయాతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) రంగంలోకి దిగారు. జాతీయ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. అటువంటి నేరాలను ఏమాత్రం క్షమించమని.. నేరస్థులకు మరణశిక్ష ఖాయమని తేల్చి చెప్పారు.
‘విద్యార్థులపై విషప్రయోగాల ఘటనలపై అధికారులు దర్యాప్తు చేయాలి. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవని తేలితే సదరు దోషులను ఏమాత్రం క్షమించవద్దు. వారికి మరణ శిక్ష విధించండి’ అని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా దర్యాప్తు అధికారులు పలువురిని అరెస్టు చేశారు.
Also Read..
MLC Kavitha | తెలంగాణ తల వంచదు : ఎమ్మెల్సీ కవిత
Cricketers Holi: హోలీ ఆడిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
Womens Day | మహిళల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం : మంత్రి హరీశ్‌రావు