Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Session) వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష కూటమి ఎంపీల ఆందోళనలతో నాలుగోరోజు కూడా లోక్‌సభలో (Lok Sabha) గందరగోళం నెలకొంది. దీంతో సభ ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్‌సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Lok Sabha proceedings adjourned till 2 pm over protests by opposition MPs in the House. pic.twitter.com/KHjEjkyAdS
— ANI (@ANI) July 24, 2025
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ( INDIA bloc MPs) ఆందోళనకు (protest) దిగారు. బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాలుగోరోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సహా పలువురు ఇండియా కూటమి ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
Also Read..
Australia | నిన్న భారతీయుడిపై దాడి.. నేడు ఆలయంపై గ్రాఫిటీ.. ఆస్ట్రేలియాలో రెచ్చిపోయిన జాత్యహంకారులు
Fake Encounter: నకిలీ ఎన్కౌంటర్ కేసులో మాజీ ఎస్పీకి పదేళ్ల జైలుశిక్ష