Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Session) వరుసగా నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ( INDIA bloc MPs) ఆందోళనకు (protest) దిగారు. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాలుగోరోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సహా పలువురు ఇండియా కూటమి ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
#WATCH | Delhi: INDIA bloc MPs stage a protest outside the Parliament, against the Special Intensive Revision (SIR) exercise being carried out by the Election Commission of India ahead of the Bihar Assembly elections pic.twitter.com/0Qhe7EqfQW
— ANI (@ANI) July 24, 2025
Also Read..
Horses Fight | రోడ్డుపై తలపడ్డ రెండు గుర్రాలు.. ఆటోలో ఇరుక్కుపోయి.. షాకింగ్ వీడియో
Fake Encounter: నకిలీ ఎన్కౌంటర్ కేసులో మాజీ ఎస్పీకి పదేళ్ల జైలుశిక్ష
Vice President | తదుపరి ఉపరాష్ట్రపతి బీజేపీ నుంచే..!