Horses Fight | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై రెండు గుర్రాలు తీవ్రంగా తలపడ్డాయి (Horses Fight). స్థానికులను బెంబేలెత్తించాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
జబల్పూర్ (Jabalpur)లో రద్దీగా ఉండే నాగరత్చౌక్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు గుర్రాలు నడిరోడ్డుపై తీవ్రంగా తలపడ్డాయి. ఫైటింగ్ చేసుకుంటూ ముందుగా ఓ షోరూమ్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి అందరినీ హడలెత్తించాయి. ఈ క్రమంలో ఓ గుర్రం రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఆటో (Rickshaw)లోకి దూకి అందులోనే ఇరుక్కుపోయింది. ఎటూ కదల్లేక నానా తంటాలు పడింది. స్థానికులు దాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు 20 నిమిషాల పాటూ అశ్వం ఆటోలోనే చిక్కుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Horse Gets Stuck in Auto-Rickshaw While Fighting With Another, Injures 2 People Sitting Inside At Jabalpur’s Nagarth Square#madhyapradesh #jabalpur #Auto pic.twitter.com/tPdsZBy4GS
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 23, 2025
Also Read..
Vice President | తదుపరి ఉపరాష్ట్రపతి బీజేపీ నుంచే..!
Emergency Quota: ఎమర్జెన్సీ కోటా రూల్స్ మార్చిన రైల్వేశాఖ