Vice President | ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేయడంతో తదుపరి వీపీ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor), జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh), జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ ఎల్జీ సక్సేనా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. వీరిలో ఎవరికో ఒకరికి ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఇప్పుడు అనూహ్యంగా జేడీయూ నేత, కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ (Ram Nath Thakur)ను ఆ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై బీజేపీ (BJP)కి చెందిన పలువురు స్పందించారు. తదుపరి ఉపరాష్ట్రపతిని బీజేపీకి చెందిన నేతనే అధిష్ఠానం ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ త్వలోనే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రాబోయే 48 నుంచి 72 గంటల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
Also Read..
“VP Resignation | బీజేపీతో పొసగకే ఉపరాష్ట్రపతి రాజీనామా..! అభిశంసన తీర్మానం చిచ్చు..!”