Australia | ఆస్ట్రేలియా (Australia)లో జాత్యహంకారులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే కారు పార్కింగ్ విషయంలో ఓ భారతీయుడిపై వర్ణవివక్ష పేరుతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. తాజాగా ఓ హిందూ ఆలయంపై గ్రాఫిటీ (graffiti)తో విద్వేష పూరిత రాతలు రాశారు. ఈ ఘటన మెల్బోర్న్ (Melbourne)లో చోటు చేసుకుంది. అక్కడ స్వామి నారాయణ్ (Swaminarayan Temple) ఆలయం గోడలపై ‘గో హోమ్ బ్రౌన్’ అంటూ హిట్లర్ బొమ్మను ముద్రించారు.
ఆలయంతోపాటూ రెండు ఆసియా రెస్టారెంట్లపై కూడా ఇలా విద్వేషపూరిత వ్యాఖ్యలే రాశారు. ఈ ఘటనను స్థానికంగా ఉన్న హిందూ సమాజం తీవ్రంగా ఖండించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ మాట్లాడుతూ.. తాజా ఘటనను హిందువులపై దాడిగా అభివర్ణించారు. ‘శాంతి, భక్తి, ఐక్యతకు నిలయంగా ఉన్న ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడి చేశారు. ఇది మా గుర్తింపు, మత స్వేచ్ఛపై జరిగిన దాడి’ అని పేర్కొన్నారు.
భారతీయ విద్యార్థిపై దాడి
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై అటాక్ జరిగింది. 23 ఏళ్ల విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌ను కొట్టారు. సెంట్రల్ అడిలైడ్‌లో ఆ దాడి ఘటన చోటుచేసుకున్నది. వర్ణవివక్ష పేరుతో అటాక్( Racial Attack) జరిగినట్లు తెలుస్తోంది. కింటోర్ అవెన్యూ వద్ద ఈ ఘటన జరిగింది. సిటీ లైట్ డిస్ప్లేను చూసేందుకు భార్యతో కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. జూలై 19వ తేదీన ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read..
Racial Attack: ఆస్ట్రేలియాలో వర్ణవివక్ష.. భారతీయ విద్యార్థిపై దాడి
India – Pak War | భారత్-పాక్ వివాదంపై పాతపాటే ఎత్తుకున్న అమెరికా.. దీటుగా జవాబిచ్చిన భారత్
PM Modi | లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..