MK Stalin | లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై (Delimitation) చర్చించేందుకు తమిళనాడు (Tamil Nadu)లోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అధ్యక్షతన చెన్నైలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏడు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదన్నారు. దీన్ని ఐక్యంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గితే మన వాణిని వినిపించే శక్తి కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తుందన్నారు. ‘మా నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదు. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలనేదే మా డిమాండ్. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతే.. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకే న్యాయబద్ధంగా పునర్విభజన జరగాలి’ అని స్టాలిన్ అన్నారు.
Also Read..
Supriya Sule | విమానాలు సమయానికి రావట్లేదు.. ఎయిర్ ఇండియాపై సుప్రియా సూలే అసహనం
Ladakh | చైనా దురాక్రమణను భారత్ ఎన్నటికీ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టీకరణ
KTR | డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయమే.. ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు: కేటీఆర్