Ladakh | సరిహద్దుల్లో చైనా దుందుడుకు వ్యవహారశైలిపై భారత్ మరోసారి మండిపడింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని (illegal occupation) భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. కాగా, సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతుంటే.. చైనా మాత్రం కవ్వింపులకు పాల్పడుతోంది. లఢఖ్ (Ladakh) భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీల (China counties)ను ఏర్పాటు చేస్తోంది.
ఈ విషయంపై ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చైనా కౌంటీల నిర్మాణంపై కేంద్రానికి సమాచారం ఉందా..? అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కౌంటీలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా తమకు సమాచారం ఉందని వెల్లడించారు. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. చైనా పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణను భారత్ చట్టబద్ధం చేయబోదన్నారు.
Also Read..
Supriya Sule | విమానాలు సమయానికి రావట్లేదు.. ఎయిర్ ఇండియాపై సుప్రియా సూలే అసహనం
India | అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి.. విద్యార్థులకు భారత్ కీలక సూచన
Donald Trump | సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్ జీతం సొంత డబ్బుతో చెల్లిస్తా : డొనాల్డ్ ట్రంప్