Donald Trump | ఎనిమిది రోజుల మిషన్ కోసం అనివెళ్లి దాదాపు తొమ్మిది నెలల పాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్ భూమికి చేరారు.
నిర్దేశిత సమయం కంటే సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరికి అదనపు వేతనాలు (Overtime Salary) ఉంటాయా..? లేదా..? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో వీరికి అదనపు వేతనం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. వాళ్లకు ఓవర్‌టైమ్ జీతాన్ని తన సొంత డబ్బుతో చెల్లిస్తానని ప్రకటించారు. ‘సునీతా విలియమ్స్, విల్మోర్కు ఎలాంటి అదనపు వేతనం ఉండదా..?’ అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘నేను చేయాల్సివస్తే.. నా జేబు నుంచి వారికి ఓవర్‌టైమ్ జీతం చెల్లిస్తా’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఇదే సందర్భంగా వ్యోమగాములను (Austronauts) సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్ మస్క్ (Elon Musk)కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read..
“Mamata Banerjee | సునీతా విలియమ్స్‌కు భారత రత్న ఇవ్వాలి : మమతా బెనర్జీ”