తాండూరు, ఫిబ్రవరి 16: తాండూరు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. రిటర్నింగ్ అధికారి మంగీలాల్ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలను బహిష్కరించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మందిలో 11 మంది హాజరయ్యారు. 25 వ వార్డు కౌన్సిలర్ భర్త మృతిచెందడంతో ఆమె హాజరుకాలేదు. కౌన్సిలర్లు దీపానర్సింహులు, ఇర్షాద్, సురేశ్‌నాయక్, జావేద్, నవీనాసంతోష్గౌడ్, సుప్రితాకరుణాకర్, అనిల్‌కుమార్, నాగలక్ష్మి తదితరులు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో కాంగ్రెస్ దుర్మార్గాలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండగడుతారని స్పష్టంచేశారు. పైలెట్ రోహిత్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో పోలీసు కేసులు అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు.