Leopard | అదో పెళ్లి వేడుక.. అతిథులతో వాతావరణం అంతా ఎంతో సందడిగా ఉంది. వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన వారంతా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో అక్కడికి ఊహించని అతిథి ప్రత్యక్షమైంది. అప్పటి వరకూ ఎంతో ఉత్సాహంగా సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఊహించని అతిథి మరెవరో కాదు.. చిరుత (Leopard). ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
लखनऊ में शादी समारोह में घुसा तेंदुआ
जिसके बाद समारोह में भगदड़ मच गई.
वन विभाग की टीम ने कड़ी मशक्कत के बाद तेंदुए को पकड़ा
तेंदुए ने वन विभाग के एक कर्मचारी को कर दिया था घायल#Lucknow #leopard #Wedding #UttarPradesh pic.twitter.com/DpMU7SWucD
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) February 13, 2025
పారాలోని బుద్దేశ్వర్ రింగ్ రోడ్లో గల ఎంఎం లాన్లో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుక జరుగుతోంది. రాత్రి 11:40 గంటల సమయంలో ఈ వేడుకలోకి ఓ చిరుత పులి ప్రవేశించింది. చిరుతను చూసిన వారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. మరికొంతమంది మొదటి అంతస్తులో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వధూవరులు సైతం అక్కడి నుంచి బయటకు వచ్చి కారులో లాక్ చేసుకుని కూర్చున్నారు.
लखनऊ: बुद्धेश्वर रिंगरोड स्थित एम एम लॉन में शादी समारोह के दौरान टेंट के पीछे से एक तेंदुआ घुस आया, जिससे अफरा-तफरी मच गई। सूचना पर पहुंची पुलिस और वन विभाग की टीम ने मैरिज हॉल खाली कराया कड़ी मशक्कत के बाद वन विभाग ने तेंदुए को पकड़ लिया। #Leopard #Lucknow pic.twitter.com/nyUiDUdaqo
— Hayat Abbas naqvii🇮🇳 (@hayatabbas110) February 13, 2025
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 5 గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు చిరుతను బంధించారు. ఖేరి అటవీ ప్రాంతం నుంచి చిరుత తప్పిపోయి ఇటువైపు వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు తెలిపారు. బంధించిన చిరుతను తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు. చిరుతను బంధించే క్రమంలో ఓ అధికారి చేతికి గాయమైనట్లు తెలిసింది. ఈ ఘటనతో సందడిగా ఉన్న పెళ్లి వాతావరణం కాస్తా గందరగోళానికి దారి తీసింది.
बिन बुलाए शादी में आया मेहमान..
लखनऊ के शादी समारोह में तेंदुआ #Marriage #Lucknow #leopard pic.twitter.com/kaMHNT89oB— Narendra Singh Bisht (@Narendr51543168) February 13, 2025
Also Read..
Waqf bill | వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికకు రాజ్యసభ ఆమోదం
PM Modi | అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ