Leopard | హాలిడే సందర్భంగా సరదాగా పార్క్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని అనుభవం ఎదురైంది. పార్క్‌లో సఫారీకి వెళ్లగా అక్కడ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సఫారీ (Safari) వాహనంలో ఉన్న సమయంలో చిరుత (Leopard) దాడి చేసింది. ఈ దాడిలో 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆగస్టు 15 సందర్భంగా హాలిడే కావడంతో ఓ ఫ్యామిలీ సరదాగా గడిపేందుకు బెంగళూరు (Bengaluru)లోని బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్ (Bannerghatta Biological Park)కు వెళ్లింది. అక్కడ చిరుతలను చూసేందుకు సఫారీకి వెళ్లింది. ఓ చోట డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. అక్కడ చిరుత రోడ్డుపక్కన కూర్చుని కనిపించింది. కాసేపటి తర్వాత డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అప్పటి వరకూ కామ్‌గా ఉన్న చిరుత ఒక్కసారిగా వాహనాన్ని వెంబడించింది. విండో పక్కన కూర్చొని ఉన్న బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి గాయాలైనట్లు తెలిసింది.
సదరు బాలుడు తన చేతులను విండో బయటకు పెట్టడంతోనే చిరుత దాడి చేసిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాహనంలోని టూరిస్ట్‌లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ తతంగాన్నంతా వెనుక సఫారీ వాహనంలోని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది.
A 13-year-old boy was attacked by a leopard at the Bannerghatta Biological Park in Bengaluru on Friday afternoon when the boy was on a safari along with his parents. The leopard attacked the boy through the window of the vehicle when the driver had stopped for the visitors to see… pic.twitter.com/K4g7Zu08xL
— Karnataka Portfolio (@karnatakaportf) August 15, 2025
Also Read..
Cockpit Door | నిర్లక్ష్యంగా కాక్‌పిట్ డోర్ తెరచిపెట్టిన పైలట్.. తర్వాత ఏమైందంటే..!
Cloudburst | చషోటి గ్రామాన్ని సందర్శించిన జమ్ము కశ్మీర్ సీఎం.. బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Man Tied To Pole Thrashed | వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టి.. రాత్రంతా అలాగే ఉంచిన అత్తమామలు