Cloudburst | జమ్ము కశ్మీరులోని కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన కుండపోత వర్షానికి వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 60 మందికిపైగా మరణించగా 100 మందికిపైగా గాయపడ్డారు. చషోటీ గ్రామంలో గురువారం వచ్చిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా చషోటి (Chasoti) గ్రామాన్ని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సందర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మరోవైపు బాధిత కుటుంబాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. విపత్తులో మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపింది. ఇక ఈ ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న నిర్మాణాలకు రూ.లక్ష, తీవ్రంగా దెబ్బతిన్న నిర్మాణాలకు రూ.50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న నిర్మాణాలకు రూ.25 వేలు చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
After visiting the cloudburst-affected areas of Kishtwar, J&K Chief Minister Omar Abdullah has announced an ex-gratia relief from the CM’s Relief Fund: Rs 2 lakh for each deceased, Rs 1 lakh for severely injured, Rs 50,000 for minor injuries, Rs 1 lakh for fully damaged… pic.twitter.com/NZmqriYc0I
— ANI (@ANI) August 16, 2025
కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన ఆకస్మిక కుంభవృష్టికి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా దాదాపు 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 200 మంది వరకు గల్లంతయ్యారు. మారుమూల పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై మేఘ విస్ఫోటం (Cloudburst) సంభవించి గ్రామాన్ని వరద ముంచెత్తినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మచైల్ మాతాదేవి యాత్రకు వెళ్లే మార్గంలో వాహనాలు వెళ్లగల చివరి గ్రామం చషోటీని కుంభవృష్టి ముంచెత్తినట్లు అధికారులు చెప్పారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న చండీమాత ఆలయంలో జరుగుతున్న వార్షిక మచైల్ మాత యాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చషోటీ గ్రామానికి చేరుకున్నపుడు ఈ ఘటన జరిగింది.
Also Read..
“కశ్మీర్లో జల బీభత్సం.. 52 మంది మృతి.. 200 మంది గల్లంతు”
“Kishtvar Floods | వరద ఉద్ధృతికి 65కు చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద ఇంకెందరో..!”