జమ్ము, ఆగస్టు 15: జమ్ము కశ్మీరులోని కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన కుండపోత వర్షానికి వరదలు ముంచెత్తిన ఘటనలో 60 మంది మరణించగా 100 మందికిపైగా గాయపడ్డారు. చషోటీ గ్రామంలో గురువారం వచ్చిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం తెలిపారు.
శిథిలాల కింద 500 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఈ సంఖ్య వెయ్యి దాటవచ్చుని అంటున్నారని ఇది అత్యంత బాధాకరమైన ఘటనని ఆయన అన్నారు.