Kishtvar Floods : జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వర్లో బీభత్సం సృష్టించిన వర్షం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. వరద ఉద్ధృతికి వందలాది మంది కొట్టుకుపోగా పలు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆ రాష్ట్ర మంత్రి జావేద్ దార్ (Javed Dar) మృతుల సంఖ్య 60 దాటిందని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం మచైలీ మాతా యాత్ర మార్గంలో సంభవించిన ‘ఫ్లాష్ ఫ్లడ్స్'(Flash Floods) కారణంగా శుక్రవారం 65 మంది మరణించారని తెలిపారు. అయితే.. శిధిలాల కింద మరికొంతమంది మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ దళాలు భావిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ గురువారం రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ తీవ్రగాయాలతో బాధపడుతున్న167 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఈ బృందాలు.
VIDEO | Search and rescue operations underway after a massive cloudburst in Kishtwar triggered flash floods, killing at least 60 people, including two CISF personnel, and leaving many others trapped.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/50QwTssyhm
— Press Trust of India (@PTI_News) August 15, 2025
‘క్లౌడ్ బరస్ట్’ (Cloud Burst) కారణంగా ఊహించని ఉప్పెనను ఎదుర్కొంటున్న జమ్ము కశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha)తో మాట్లాడిన మోడీ పరిస్థితిని ఆరా తీశారు. సీఎం అబ్దుల్లా మాట్లాడుతూ.. తాను వరద తీవ్రతకు దెబ్బతిన్న కిష్త్వర్లోని చొసిటి ప్రాంతానికి వెళ్లి.. అక్కడ సహాయ చర్యలను పరిశీలిస్తానని వెల్లడించారు. భారీగా నష్టపోయిన అక్కడి ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసేలా చూస్తానని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
I’ll be leaving for Kishtwar later this afternoon & will be going to the scene of the cloud burst tragedy early tomorrow morning to see, first hand, the extent of the damage. I will review the rescue operation & assess what further help is required.
— Omar Abdullah (@OmarAbdullah) August 15, 2025