హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్‌ను నిరసిస్తూ ఈనెల 25న బ్లాక్‌డేగా పాటించనున్నట్టు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఈ యాక్ట్ ద్వారా పెన్షన్‌పై సర్వాధికారాలను కేంద్రం లాగేసుకున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన పెన్షనర్స్ జేఏసీ కార్యవర్గ సమావేశంలో ఆలిండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డీ సుధాకర్ మాట్లాడారు. ఈ యాక్ట్‌తో 2026 జనవరి 1 కన్నా ముందు రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ హెచ్చింపులు, డీఆర్, పీఆర్సీ ఇవ్వాలా? వద్దా? అనే అధికారం కేంద్ర తన వద్దే పెట్టుకున్నదని ఆరోపించారు. 8వ పే కమిషన్‌లో పెన్షన్ ప్రస్తావనే లేకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇదే అమలైతే పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ, కృష్ణప్రసాద్, రాజేంద్రబాబు, భరత్‌రెడ్డి, సాయిరెడ్డి, దేవేందర్, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.