Lalit Modi | వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) ఇటీవలే లండన్‌లో 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ (Lalit Modi) పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించి వీడియో ఒకటి ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ‘మేం ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులం’ (biggest fugitives of India) అంటూ లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై లలిత్ మోదీ తాజాగా క్షమాపణలు (apology) చెప్పారు.
‘ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం మాకు లేదు. నా వ్యాఖ్యలతో భారత ప్రభుత్వాన్ని, నాకు అత్యంత గౌరవంగా ఉన్న వారిని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. వీడియోలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందుకు గానూ నేను క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. భారత ప్రభుత్వం (Indian government) పట్ల తమకు గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
విజయ్ మాల్యా పుట్టినరోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలు పలువురు హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియోని లలిత్ మోదీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. అందులో మేం ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ వ్యాఖ్యానించారు. కానీ విజయ్ మాల్యా మాత్రం ఆ వీడియోలో ఎటువంటి కామెంట్ చేయలేదు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు లలిత్ మోదీ వైఖరిని తప్పుపట్టారు. పరారీలో ఉన్న లలిత్ మోదీని కర్మ వెంటాడుతుందని, ఇవాళ కాకపోతే, రేపైనా అని కొందరన్నారు. భారతీయ చట్టాలను కించపరిచే రీతిలో లలిత్ మోదీ వ్యాఖ్యలు చేసినట్లు ఓ యూజర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటే బలమైన వాళ్లు దేశాన్ని లూటీ చేసుకోవచ్చు అన్న సందేశం వస్తుందని కొందరన్నారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో లలిత్ మోదీ తాజాగా క్షమాపణలు చెప్పారు.
Also Read..
Nur Khan base | 36 గంటల్లో.. 80 డ్రోన్లు.. నూర్ ఖాన్ బేస్‌పై భారత దాడుల్ని అంగీకరించిన పాక్
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన, రైలు సేవలపై ప్రభావం.. రెడ్ అలర్ట్ ఇష్యూ చేసిన ఐఎండీ